Tue Mar 17 2026 08:25:42 GMT+0530 (India Standard Time)
నేడు మహాలక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మ
ఇంద్రకీలాద్రి పై శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు

విజయవాడ ఇంద్రకీలాద్రి పై శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. నేడు అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని విశ్వసిస్తారు.అందుకే ఉదయం నుంచే విజయవాడ దుర్గగుడిపై భక్తులు బారులు తీరారు. క్యూ లైన్ లలో నిల్చున్న వారికి మంచినీరు, మజ్జిగ అందిస్తున్నారు.
బారులు తీరిన భక్తులు...
మహాలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారిని చూసేందుకు ఉదయం నాలుగు గంటలకే భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు. దీంతో భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. అంతరాలయం దర్శనం నిలిపిపేయడంతో అందరూ అమ్మవారిని దూరం నుంచిదర్శనం చేసుకుని వెళ్లాల్సిందే. వీవీఐపీలకు ప్రత్యేక దర్శనంఏర్పాట్లను చేశారు.
Next Story

