Sat Mar 07 2026 14:53:59 GMT+0530 (India Standard Time)
ఏపీలో సంక్రాంతి సెలవులు ఇవే
సంక్రాంతి సెలవులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చింది. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకూ సెలవులను మారుస్తూ నిర్ణయం తీసుకుంది

సంక్రాంతి సెలవులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చింది. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకూ సెలవులను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు సెలవులను మార్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. తొలుత ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకూ ప్రభుత్వం పాఠశాలలకు సంక్రాంతి సెలవులను ప్రకటించించింది.
అంతకు ముందు...
అయితే ఉపాధ్యాయ సంఘాల నేతలు 11 నుంచి 18వ తేదీ వరకూ సెలవులు పొడిగించాలని కోరారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక రోజు ముందుకు జరిపి 12వ తేదీ నుంచి సెలవులు ఇవ్వడంపై మళ్లీ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పండగ ముందు రోజు బయలుదేరాలంటే కష్టమవుతుందని చెబుతున్నారు. 11 నుంచి 18వ తేదీ వరకూ సెలవులు ఇవ్వాలని ఉపాధ్యా సంఘాలు కోరుతున్నాయి.
Next Story

