Tue Jan 13 2026 04:52:59 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ సర్కార్ సంక్రాంతికి గుడ్ న్యూస్
ఉద్యోగులు, వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక ప్రకటించింది

ఉద్యోగులు, వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక ప్రకటించింది. సంక్రాంతి కానుకగా వివిధ రకాల బిల్లులను ఆర్థికశాఖ క్లియర్ చేసింది. 2,653 కోట్ల రూపాయల డీఏ, డీఆర్ ఎరియర్స్, కాంట్రాక్టర్ల బిల్లులకు నిధులు విడుదల చేసింది. పెండింగ్లో ఉన్న డీఏ, డీఆర్ ఎరియర్స్ కోసం 1,100 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది.
కాంట్రాక్టర్, ఉద్యోగులకు...
దీంతో పాటు పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవులకు 110 కోట్లు మంజూరు చేసింది. ఈఏపీ, నాబార్డ్, సాస్కీ, సీఆర్ఐఎఫ్ పనులకు1,243 కోట్లు విడుదల చేసింది. డీఏ, డీఆర్ ఎరియర్స్ చెల్లింపులతో ఉద్యోగులు, పింఛనర్లకు లబ్దిపొందనున్నారు. మొత్తంగా 5.7 లక్షల మందికి బిల్లులు, బకాయిలు ప్రభుత్వం చెల్లించింది. దీంతో ఎంతో కాలంగా పనులు పూర్తి చేసి ఎదురు చూస్తున్న కాంట్రాక్టర్లకు డబ్బులు అందనున్నాయి.
Next Story

