Thu Dec 18 2025 17:50:14 GMT+0000 (Coordinated Universal Time)
సంక్రాంతి వేడుకల్లో అంబటి
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. భోగి మంటలతో పండగను ప్రారంభించారు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. భోగి మంటలతో పండగను ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే పండగలో పాల్గొనేందుకు లక్షలాది మంది ప్రజలు ఇప్పటికే పల్లెలకు తరలి వెళ్లారు. ఇక ప్రజాప్రతినిధులు కూడా ప్రజల్లో ఒక్కరై పండగ జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. మాజీ రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు నెల్లూరు నగరంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.
అంబటి నృత్యం...
తన కుమారుడు నివాసం ఉంటున్న పటేల్ నగరంలో ఆయన కుటుంబ సభ్యులతో కలసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి ఆర్కే రోజా తన కుటుంబ సభ్యులతో కలసి నగరిలో భోగి మంటల వేడుకల్లో పాల్గొన్నారు. ఇక మంత్రి అంబటి రాంబాబు అయితే సత్తెనపల్లిలో సంక్రాంతి వేడుకల సందర్భంగా డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. వేలాది మంది ఈ సంబరాల్లో పాల్గొని పండగశోభను తెచ్చారు.
- Tags
- ambati rambabu
Next Story

