Sun Jan 11 2026 14:00:33 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు ఆత్రేయపురంలో కేరళ తరహా పడవ పోటీలు
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఆత్రేయపురంలో నేటి నుంచి కేరళ తరహా పడవ పోటీలను నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు ఈ పడవల పోటీలను నిర్వహించనున్నారు. ఈ పడవల పోటీలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా క్రీడాకారులు పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు.
మూడు రోజుల పాటు...
మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో గాలిపటాలు, రంగవల్లులు, ఈతల పోటీలు కూడా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. మరొకవైపుపడవల పోటీలకు కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన మొత్తం ఇరవై ఐదు జట్లు పాల్గొంటాయని నిర్వాహకులు చెప్పారు. ఈ పడవల పోటీలను తిలకించేందుకు వేలాది మంది ఆత్రేయపురానికి తరలి వస్తున్నారు.
Next Story

