Wed Mar 18 2026 09:34:25 GMT+0530 (India Standard Time)
ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి సన్నిధిలో ఎంతో వైభవంగా శాకాంబరి ఉత్సవాలు రెండో రోజు బుధవారం కొనసాగుతున్నాయి

ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి సన్నిధిలో ఎంతో వైభవంగా శాకాంబరి ఉత్సవాలు రెండో రోజు బుధవారం కొనసాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. శాకంభరిఉత్సవాలు గురువారం ఉదయం 9:30 కు మహా పూర్ణాహుతితో ఉత్సవం పరిసమాప్తి అవుతుంది. కన్నులు విందుగా ఇంద్రకీలాద్రి పై రెండో రోజు అలంకరణ చేశారు. శాకంబరీ దేవి గా దర్శనమిస్తున్న దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు.
కూరగాయలను...
ఇప్పటివరకు ఆలయ అలంకరణ,కదంబం ప్రసాదం తయారీ నిమిత్తం సుమారు 50టన్నుల పైన కూరగాయల వినియోగించారు. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల దాతల నుండి సేకరణ కూరగాయల సేకరణ నిమిత్తం 10 రోజులు నుండి ఆలయ సిబ్బంది శ్రమిస్తున్నారు. ప్రధాన ఆలయం లో కనకదుర్గ అమ్మవారు, మహా మండపం లో ఉత్సవ మూర్తి, ఉపాలయాలల్లో దేవతామూర్తులంతా హరిత వర్ణంతో విరాజిల్లుతున్నారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 వరకు ప్రత్యేక, అంతరాలయ దర్శనం రద్దు అని ఆలయ అధికారులు ప్రకటించారు.
Next Story

