Thu Mar 19 2026 04:11:03 GMT+0530 (India Standard Time)
ఏపీ ప్రభుత్వానికి సజ్జనార్ కీలక విజ్ఞప్తి
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఏపీ ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఏపీ ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఆర్టీసీకి ఇచ్చే శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను టీటీడీ పునరుద్ధరించాలని సజ్జనార్ కోరారు. ఇప్పటికే ఈ విషయమై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కోరినట్లు చెప్పారు. టూరిజం కోటా కింద కల్పించే ఈ సౌకర్యం ఇతర రాష్ట్రాల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, గత డిసెంబరు నుంచి టీటీడీ ఈ కోటాను రద్దు చేసిందని అన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
Next Story

