Sun Mar 15 2026 16:05:11 GMT+0530 (India Standard Time)
ముందస్తు ఎన్నికలకు వెళ్లబోం
తమ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు

తమ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు పూర్తి చేసిన ఐదేళ్ల తర్వాతనే తాము ఎన్నికలకు వెళతామని ఆయన ప్రకటించారు. ప్రజలకు చెప్పే ఎన్నికలకు వెళతామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పొత్తులు, ఎత్తులు లాంటి చచ్చు ఆలోచనలు తమకు లేవన్నారు.
చంద్రబాబు మాటలన్నీ...
కార్యకర్తల్లో ఉత్సాహం కోసం చంద్రబాబు ముందస్తు మాటలు చెబుతున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచి చంద్రబాబు ముందస్తు ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు కంటే తమ పార్టీని నిలబెట్టుకోవడానికి ముందస్తు ఎన్నికలంటూ ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.
Next Story

