Sun Dec 28 2025 11:19:58 GMT+0000 (Coordinated Universal Time)
బాబులో ఆ అసహనం ఎందుకో?
కర్నూలులో చంద్రబాబు అసహనంతో ఊగిపోయారని, ఆయన విన్యాసాలను ప్రజలు చూశారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు

కర్నూలులో చంద్రబాబు అసహనంతో ఊగిపోయారని, ఆయన విన్యాసాలను ప్రజలు చూశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుపై మండి పడ్డారు. న్యాయ రాజధానిపై సహజంగానే ప్రజలు చంద్రబాబును నిలదీశారన్నారు. వారెవ్వరూ తమ పార్టీ వారు కారని ఆయన తెలిపారు. న్యాయ రాజధాని విషయంలో చంద్రబాబు స్పష్టమైన సమాధానం చెప్పాలని కోరారు.
ఊగిపోయినంత మాత్రాన....
ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా చంద్రబాబుకు అంత ఆవేశం ఎందుకని సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. మొన్న పవన్ కల్యాణ్ ఆవేశంతో ఊగినట్లు చంద్రబాబు కూడా ఊగిపోయారని, పవన్ కల్యాణ్ లా చెప్పు కూడా చూపించాల్సిందని ఆయన అన్నారు. అక్కడకు వెళ్లినప్పుడు ప్రజలు నిలదీస్తారని, దానికి సమాధంన చెప్పకుండా ఆవేశంతో తిట్ల దండకం అందుకోవడం 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి నేతకు తగదని ఆయన అన్నారు. రాజధాని వికేంద్రీకరణ ఎందుకు అవసరమో తాము చెబుతామని, అమరావతిలోనే రాజధాని ఎందుకు ఉండాలో చంద్రబాబు చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు.
Next Story

