Sun Mar 15 2026 19:15:09 GMT+0530 (India Standard Time)
రాష్ట్ర పరిస్థితి ఏమాత్రం బాగా లేదు
ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, అయినా జగన్ పాలన సజావుగా సాగిస్తున్నారని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, అయినా జగన్ పాలన సజావుగా సాగిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈరోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కూడా వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
అయినా జగన్....
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కరోనా కారణంగా దారుణంగా దెబ్బతినిందని చెప్పారు. ఆర్థిక పరమైన ఇబ్బందులున్నప్పటికీ సరైన దిశలోనే రాష్ట్రం పయనిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ విజన్ తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదన్నారు. సకాలంలలో కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయాలని స్వామి వారిని కోరుకున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈరోజు వీఐపీ దర్శన సమయంలో సజ్జల స్వామి వారిని దర్శించుకున్నారు.
Next Story

