Thu Jan 29 2026 01:16:09 GMT+0000 (Coordinated Universal Time)
ముందస్తు ఆలోచనే లేదు.. సజ్జల స్పష్టీకరణ
ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనే తమకు లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనే తమకు లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. అసలు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళతామని ఆయన ప్రశ్నంచారు. ఆ అవసరం తమకు ఏముందని అన్నారు. వైసీపీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడారు. ప్రజలను మభ్యపెట్టాలనుకునే వారే ముందస్తు ఎన్నికలకు వెళతారని చెప్పారు.
ప్రజలను మభ్యపెట్టి.....
తాము ప్రజలను మభ్యపెట్టడం లేదని, అనుకున్న సమయానికే ఎన్నికలు జరుగుతాయని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. చంద్రబాబు తన ఉనికిని కాపాడుకునేందుకు ముందస్తు రాగం తీస్తున్నారని అన్నారు. ప్రజలు తమకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారని, ముందుగా ఎన్నికలకు ఎందుకు వెళతామని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని సజ్జల తెలిపారు. కేబినెట్ నుంచి బయటకు వచ్చే వారి సేవలను పార్టీకి వినియోగించుకుంటామని చెప్పారు. జగన్ రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఎప్పుడో చెప్పారని సజ్జల రామకృష్ణా రెడ్డి గుర్తు చేశారు.
Next Story

