Fri Apr 10 2026 19:49:47 GMT+0530 (India Standard Time)
అమరావతిపై పెట్టే ప్రతి పైసా కృష్ణా నదిలో పోసినట్టే
అమరావతి నిర్మాణానికి రెండు లక్షల కోట్లు కావాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు

అమరావతి నిర్మాణానికి రెండు లక్షల కోట్లు కావాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం అమరావతి 40 ఏళ్ల వరకు పూర్తికాదన్నారు. రాజధాని పూర్తికాకుండా రైతులకు ప్లాట్లు ఎలా ఇస్తారని సజ్జల ప్రశ్నించారు. జగన్ చెప్పిన ప్రకారం అన్ని కనెక్టివిటీలు ఉన్నాయని, తక్కువ ఖర్చుతో మూడు జిల్లాల కారిడార్ పూర్తవుతుందని చెప్పారు.
చట్టభద్రత అని భ్రమ కల్పిస్తున్నారని...
అమరావతి చట్టబద్ధత అని భ్రమ కల్పిస్తున్నారన్న సజ్జల రామకృష్ణారెడ్డి రెండు లక్షల కోట్ల పెట్టుబడి పెడితే వచ్చే ఆదాయం ఎంత అని ప్రశ్నించారు. అమరావతిలో పెట్టుబడి కృష్ణానదిలో పోసినట్టేనని సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిని అవినీతి గనిగా మార్చుకున్నారని అన్నారు. జగన్ పిలుపుతో మావిగన్‌కు ఒక రూపు వచ్చిందన్నారు. మంచి ప్రతిపాదన అని ప్రజలు అంటున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
Next Story

