Thu Mar 19 2026 04:28:55 GMT+0530 (India Standard Time)
శబరి ఎక్స్ప్రెస్ కు తప్పిన ముప్పు
గుంటూరు జిల్లాలో శబరి ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది. కంకరగుంట వద్ద పెద్ద రాడ్ ను రైలు పట్టాలకు కట్టారు

గుంటూరు జిల్లాలో శబరి ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది. గుంటూరు జిల్లా కంకరగుంట వద్ద పెద్ద రాడ్ ను రైలు పట్టాలపై కట్టడంతో స్థానికులు చూసి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో శబరి ఎక్స్ప్రెస్ ను అధికారులు నిలిపేశారు. రాడ్ ను తొలగించిన తర్వాత ట్రాక్ ను పరిశీలించిన అనంతరం రైలు వెళ్లేందుకు అనుమతిచ్చారు.
రాడ్ ను పట్టాలకు కట్టి...
కంకరగుంట వద్ద ఈ రాడ్ పట్టాలకు కట్టిన వారు ఎవరన్న దానిపై రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా? లేదా కావాలని చేశారా? అన్న దానిపై రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
Next Story

