Fri Dec 05 2025 09:57:16 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. శుక్ర, శని, ఆదివారాలు భక్తుల రద్దీ మరింతగా పెరుగుతుంది. మూడు రోజుల పాటు ఇంకా రద్దీ పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమలకు వచ్చిన ప్రయాణికులందరికీ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.
శుక్రవారం కావడంతో...
తిరుమలకు గత కొన్ని నెలల నుంచి భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. కార్తీక మాసం కావడంతో భక్తుల రద్దీ ఈ నెలంతా ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. తిరుమలకు సంబంధించి అనేక మార్గాల ద్వారా భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు కాలినడకన వచ్చే భక్తులు, రోజువారీ ఎస్.ఎస్.డి. టోకెన్లు తీసుకునే భక్తులతో తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడిపోతుంది. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
31 కంపార్ట్ మెంట్లలో
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 60,896 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,077 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.33 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

