Fri Dec 05 2025 11:41:59 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేటి రద్దీ ఎలా ఉందో తెలుసా?
తిరుమలలో భక్తుల భక్తుల రద్దీ కొనసాగుతుంది.

తిరుమలలో భక్తుల భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని శనివారం నాడు దర్శించుకుంటే కష్టాలు పోతాయని భక్తుల విశ్వాసం. అందుకే శనివారం అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులు కూడా శనివారం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఎక్కువ ఇష్టపడుతుంటాయి. అయితే గత కొద్ది నెలలుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
శేషాచలం అడవుల్లో...
తిరుమల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తిరుమల పుణ్యక్షేత్రం శేషాచలం అడవుల్లో ఉండటంతో భక్తులు వ్యయప్రయాసల కోర్చి తిరుమలకు చేరుకుంటారు. గంటల కొద్దీ నడిచి కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. ఇక ఘాట్ రోడ్ లు రెండు వైపులా వేర్వేరుగా ఉండటంతో సొంత వాహనాల్లో కూడా భక్తులు తిరుమలకు వస్తుంటారు. అయితే భక్తులు ఎంత మంది వచ్చినా తిరుమలలో శ్రీవారి దర్శనం సులువుగా అయ్యేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 66,675 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,681 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.32 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

