Tue Mar 17 2026 22:36:07 GMT+0530 (India Standard Time)
శ్రీవారి దర్శనానికి ఎంత సమయం అంటే?
తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది. శనివారం కావడంతో భక్తుల రాక ఎక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది. శనివారం కావడంతో భక్తుల రాక ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ ఆర్బీజీహెచ్ వరకూ కొనసాగుతుంది. క్యూలైన్ లో ఉన్న వారికి శ్రీవారి దర్శనానికి సమయం 24 గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి దర్శన సమయం మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశముంది.
24 గంటలు.....
నిన్న తిరుమల శ్రీవారిని 64,292 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,641 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.72 కోట్ల రూపాయలు అని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
Next Story

