Tue Mar 17 2026 05:58:35 GMT+0530 (India Standard Time)
తిరుమలలో దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతుంది. శుక్రవారం కూడా భక్తుల రద్దీ తగ్గలేదు

తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతుంది. శుక్రవారం కూడా భక్తుల రద్దీ తగ్గలేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 26 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచిచూస్తున్నారు. వీరికి స్వామి వారి దర్శనం 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 67,511 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,948 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.33 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Next Story

