Sat Dec 13 2025 19:29:33 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు తిరుమలకు వెళుతున్నారా? అయితే మీకొక గుడ్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ కొంత తక్కువగానే ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ కొంత తక్కువగానే ఉంది. భక్తులకు స్వామి వారి దర్శనం సులువుగానే లభిస్తుంది. గత ఐదు నెలల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అయితే గత ఐదారు రోజుల నుంచి భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భారీ వర్షాలు, తుపానులతో పాటు అనేక కారణాలతో భక్తుల రద్దీ తక్కువగానే ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరిగి రద్దీ ప్రారంభమవుతుందని, టీటీడీ అధికారులు చెబుతున్నారు.
నిత్యం తాకిడిగానే...
తిరుమలకు ఎప్పడూ భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించినప్పటికీ తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. ప్రస్తుత జనరేషన్ లోనూ ఆధ్యాత్మికత పెరగడంతో పాటు శుభకార్యాలు జరిగిన తర్వాత తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో పాటు శుభకార్యాలు కూడా జరుగుతుండటంతో తిరుమలకు భక్తుల రాక ఎక్కువగానే ఉంటుందని భావించి అందుకు తగిన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేపడుతున్నారు.
ఆరు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 84,442 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,692 మంది భక్తుల తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.51 కోట్ల రూపాయలు ఉందని అధికారులు వెల్లడించారు.
Next Story

