Fri Dec 05 2025 19:36:41 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు .. దర్శనానికి ఎంత సమయం అంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తిరమలకు తరలి వస్తున్నారు. దీంతో కాంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. అలాగే వీధులన్నీ భక్తులతో గోవిం నామ స్మరణలతో మారుమోగిపోతున్నాయి. సాధారణంగా వేసవి కాలంలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఇక పరీక్షల ఫలితాలు కూడా వెలువడటంతో అందరూ తిరుమలకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరుమలకు వచ్చేభక్తులు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో టిక్కెట్లు...
తిరుమలలో భక్తుల కోసం ప్రతి నెల టిక్కెట్లను ముందుగానే విడుదల చేస్తారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్లను మూడు నెలలు ముందుగానే ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. ప్రతి నెలా వెంటనే ఆన్ లైన్ లో హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. క్షణాల్లో టిక్కెట్లను ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తారు. వసతి గృహాలను కూడా ఆన్ లైన్ లోనే బుక్ చేసుకుంటారు. ఇలా అన్ని రకాలుగా ముందుగానే టిక్కెట్లు బుక్ అవుతుండంతో పాటు రోజువారీ ఎస్.ఎస్.డి టోకెన్లు కూడా ఎప్పటికప్పడు జారీ చేస్తుండటంతో అప్పటికప్పుడు భక్తులు తిరుమలకు చేరుకుంటారు.
31 కంపార్ట్ మెంట్లలో...
ఈరో్జు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 56,279 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 24,019 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.59 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

