Wed Mar 18 2026 01:43:27 GMT+0530 (India Standard Time)
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి పదిహేను గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఇక 300 రూపాయలు ప్రత్యేక దర్శనం తీసుకున్న భక్తులకు రెండు నుంచి మూడు గంటల వరకూ దర్శన సమయం పడుతుంది.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 64,438 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,361 మంది భక్తులు తలనీలాలలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.53 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. ఈ మూడు రోజులు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
Next Story

