Wed Mar 18 2026 01:43:27 GMT+0530 (India Standard Time)
తిరుమలలో మళ్లీ పెరిగిన రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. మంగళవారంర ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది.

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. మంగళవారంర ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 24 కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం పడుతుందని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. 300 రూపాయలు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల వరకూ దర్శన సమయం పడుతుంది.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 72,804 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 39,142 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.82 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
Next Story

