Sun Mar 15 2026 15:47:30 GMT+0530 (India Standard Time)
Tirumala Update : ఆదివారం రద్దీ మామూలుగా లేదుగా
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లలో భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.
16 గంటలు...
నిన్న తిరుమల శ్రీవారిని 69,232 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,536 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.22 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు ఇరవై కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూలైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పదహారు గంటల సమయం పడుతుంది.
Next Story

