Wed Mar 18 2026 06:09:35 GMT+0530 (India Standard Time)
తిరుమలలో తగ్గని రద్దీ.. వీకెండ్ కావడంతో
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. దీంతో తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. శని, ఆదివారాలు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంటుందని అధికారులు చెప్పారు.
హుండీ ఆదాయం...
మరోవైపు నిన్న తిరుమల శ్రీవారిని 72,195 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,967 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.24 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

