Wed Mar 18 2026 09:14:30 GMT+0530 (India Standard Time)
తిరుమలలో తగ్గని రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా తగ్గలేదు. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా తగ్గలేదు. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈరోజు శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. వేసవి సెలవులు కావడంతో పాటు తమిళనాడు నుంచి భక్తుల రాక ఎక్కువగా ఉండటంతో రద్దీ ఎక్కువగా ఉందని అధికారులు చెప్పారు.
30 కంపార్ట్మెంట్లలో....
నిన్న సోమవారం 78,602 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 42,423 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం 4.32 కోట్లు లభించింది మరికొద్దిరోజులు రద్దీ కొనసాగే అవకాశముందని, వీఐపీలు రద్దీ చూసుకుని తిరుమలకు ప్లాన్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Next Story

