Fri Dec 05 2025 19:53:44 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా సాధారణమే... సులువగానే దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగానే ఉంది. గురువారం కావడంతో పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పటికీ పెద్దగా భక్తులు తిరుమలకు ఇంకా చేరుకోలేదు

తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగానే ఉంది. గురువారం కావడంతో పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పటికీ పెద్దగా భక్తులు తిరుమలకు ఇంకా చేరుకోలేదు. ఈరోజు ఉదయం చిన శేషవాహనంపై మలయప్ప స్వామి మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు గరుడ వాహనం రోజున అధిక సంఖ్యలో భక్తులు దర్శనమివ్వనున్నారు. నిన్ననే తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంంభమయ్యాయి. ఈరోజు నుంచి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు...
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా గరుడ వాహనం రోజున భక్తులకు అన్నప్రసాదాలను ఉచితంగా అందచేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లను టీటీడీ అధికారులు చేయనున్నారు. దీంతో పాటు వాహనాలను కూడా కొండపైకి అనుమతించరు. అలిపిరి దిగువన పార్కింగ్ ఏర్పాట్లను కూడా అధికారులు చేస్తున్నారు. ద్విచక్రవాహనాలను ఆరోజు తిరుమల కొండపైకి అనుమతించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.
ఏడు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఏడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 58,628 మందిభక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,551 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.01 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

