Fri Dec 05 2025 19:04:35 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేేడు తిరుమలకు వెళుతున్నాారా? అయితే సులువుగా దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ నామమాత్రంగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ నామమాత్రంగా ఉంది. తిరుమలలో భక్తులు కంపార్ట్ మెంట్లలో శ్రీవారిని దర్శించుకునేందుకు వేచి ఉన్నారు. కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలను, మజ్జిగ, మంచినీటిని శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్నారు. వేసవి తీవ్రత తగలకుండా భక్తులు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీసుకుంటున్నారు. వేసవి ఎండకు కాళ్లు కాలిపోకుండా కార్పెట్లు పరిచి వాటిపై నీళ్లను చల్లుతున్నారు.
ఏరోజుకు ఆరోజు...
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా ఎస్.ఎస్.డి టోకెన్లు ఏ రోజు కారోజు జారీ చేస్తుండంతో చిత్తూరు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు వచ్చి ఏడుకొండల వాడిని దర్శించుకుంటున్నారు. దర్శన టోకెన్లు తిరుపతిలో లభిస్తుండటంతో అక్కడ టోకెన్లు తీసుకుని తిరుమలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు కూడా తిరుమలకు చేరుకుంటును్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఆరు గంటల సమయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో పది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తుకలకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 66,393 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.86 కోట్లరూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

