Fri Dec 05 2025 20:20:13 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : ఈరోజు తిరుమలకు వెళుతున్నారా? అయితే మీకొక గుడ్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శనివారం అయినా భక్తుల రద్దీ అంతగా లేదు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శనివారం అయినా భక్తుల రద్దీ అంతగా లేదు. శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి ఎక్కువ మంది భక్తులు మిగిలిన వారాల్లో స్వామి వారిని దర్శించుకుంటున్నారు. దీంతో శనివారం భక్తుల రద్దీ కొంత తగ్గుతుందని అధికారులు తెలిపారు. మరొకవైపు భారీ వర్షాలు కురుస్తున్నందున భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారని కూడా భావిస్తున్నారు. మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశముందని, భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని చెప్పడంతో తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో....
తిరుమలకు సాధారణంగా శుక్ర, శని, ఆదివారాలు భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ గత కొద్ది రోజుల నుంచి వారాలతో సంబంధం లేకుండా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. గత మూడున్నర నెలలుగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. హుండీ ఆదాయం కూడా శ్రీవారికి భారీగా పెరిగింది. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు అప్పటికప్పడు వచ్చే వారితో తిరుమల నిత్యం రద్దీగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. భక్తులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా సులువుగా దర్శనం అయ్యేలా అనేక రకాలుగా టీటీడీ ప్రయోగాలు చే్స్తుంది.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని తొమ్మిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 65,717 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,445 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.39 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

