Sat Dec 06 2025 00:09:07 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ తాగడానికి కారణం అదేనా?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. సోమవారం కావడంతో భక్తులు రద్దీ బాగా తగ్గింది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. సోమవారం కావడంతో భక్తులు రద్దీ బాగా తగ్గింది. గత కొద్ది రోజుల నుంచి భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. భారీ వర్షాలకు భక్తుల రద్దీ తక్కువగా ఉందని చెబుతున్నారు. గత కొంతకాలంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే వారి సంఖ్య కూడా కొంత తగ్గింది. గత నాలుగు రోజుల నుంచి కంపార్ట్ మెంట్లు కూడా పూర్తిగా నిండటం లేదు. భక్తులు సులువుగా దర్శనం చేసుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
తక్కువగా రావడంతో...
ఎక్కువ మంది ముందుగా ప్రత్యేక దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు కాలినడకన వచ్చే భక్తులు చిత్తూరు, తిరుమల జిల్లాకు చెందిన వారు ఎక్కువ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తుల సంఖ్య తగ్గడంతో సులువుగానే వసతి గృహాలు లభ్యమవుతున్నాయని భక్తులు చెబుతున్నారు. దర్శనం కూడా పెద్దగా వేచి చూడకుండానే సత్వరం జరగుతుందని అంటున్నారు. తిరిగి వర్షాలు తగ్గిన తర్వాత భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ నెల 7వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా దాదాపు పన్నెండు గంటల పాటు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
మూడు కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుఠం క్యూ కాంప్లెక్స్ లోని మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు గంట నుంచి రెండు గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తుంది. నిన్న తిరుమల శ్రీవారిని 70,310 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,866 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.49 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

