Fri Dec 05 2025 20:17:37 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు నేడు వెళితే స్వామి వారి దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఆదివారం అయినప్పటికీ భక్తుల రద్దీ అంతగా లేదు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఆదివారం అయినప్పటికీ భక్తుల రద్దీ అంతగా లేదు. గత మూడు రోజులుగా భక్తుల రద్దీ స్వల్పంగానే ఉంది. గత మూడు నెలల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. దర్శనానికి ఇరవై నాలుగు గంటలకు పైగానే సమయం పట్టింది. అదే సమయంలో కంపార్ట్ మెంట్లు నిండిపోయి బయట రెండు నుంచి మూడు కిలో మీటర్ల వరకూ క్యూ లైన్ విస్తరించింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సయితం భక్తులు ఇబ్బందులు పడకుండా, దర్శనం అందరికీ అయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంది.
భారీ వర్షాల కారణంగా...
తిరుమలకు భక్తులు నిత్యం వస్తుంటారు. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా బాలాజీ దర్శన్ కోసం దేశ వ్యాప్తంగా భక్తులు తిరుమలకు చేరుకుంటారు. అయితే ఇటీవల కాలంలో ఉత్తర భారతంలోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో గత మూడు రోజుల నుంచి భక్తుల రద్దీ కొంత తగ్గుతూనే ఉంది. హుండీ ఆదాయం మాత్రం తిరుమల దేవస్థానానికి ప్రతి రోజూ మూడు కోట్ల రూపాయలకు పైగానే సమకూరుతుంది. ఈ నేపథ్యంలో మళ్లీ రద్దీ పెరిగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పన్నెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది నుంచి పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 77,295 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,779 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.92 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

