Tue Mar 17 2026 22:35:34 GMT+0530 (India Standard Time)
తిరుమలలో పెరిగిన రష్
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరుగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరుగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వీరికి దర్శన సమయం 12 గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. రూ. 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు గంటల నుంచి మూడు గంటల వరకూ దర్శన సమయం పడుతుంది.
హుండీ ఆదాయం కూడా...
నిన్న తిరుమల శ్రీవారిని 72,540 మంది దర్శించుకున్నారు. వీరిలో 33,339 భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.91 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
Next Story

