Mon Mar 16 2026 21:49:12 GMT+0530 (India Standard Time)
వీకెండ్ : భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వీకెండ్ కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వీకెండ్ కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 26 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు ఐదు గంటల వరకూ దర్శన సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు లేకుండా ఉదయం ఏడు గంటలకు క్యూ లైన్ లోకి ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల శీఘ్రదర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 77,856 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 35,783 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.94 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీటీ అధికారులు తెలిపారు.
Next Story

