Fri Dec 05 2025 14:54:52 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : గుడ్ న్యూస్.. తిరుమల వెళుతున్నారా..? అయితే మీకు దర్శనానికి ఎంత సమయం అంటే?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ తగ్గింది.

తిరుమలలో నేడు భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం కావడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో తిరుమలకు చేరుకునే వారి సంఖ్య తగ్గింది. తిరుమలలో స్వామి వారి దర్శనం సులువుగా మారింది. తక్కువ సమయంలోనే ఏడుకొండలవాడిని భక్తులు దర్శించుకుంటున్నారు. కంపార్ట్ మెంట్లలో పెద్దగా వేచి ఉండకుండానే స్వామి వారి దర్శనం పూర్తి కావస్తుండటంతో భక్తులు ఆనంద పరవశ్యంలో మునిగిపోతున్నారు. తిరుమలలో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో వసతి గృహాలు కూడా సులువుగా భక్తులకు లభిస్తున్నాయి.
గత మూడు నెలల నుంచి...
గత మూడు నెలల నుంచి తిరుమలకు భక్తుల సంఖ్య కొనసాగుతుంది. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ క్యూ లైన్లు విస్తరించి ఉన్నాయి. స్వామి వారి దర్శనానికి గంటల కొద్దీ సమయం పట్టేది. దాదాపు ఎక్కువ రోజులు ఉచిత దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పట్టింది. వసతి గృహాలు కూడా భక్తులకు దొరకక తిరుపతిలోనే గదులు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ సోమవారం మాత్రం ఇందుకు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. తిరుమలకు భక్తుల సంఖ్య తగ్గడంతో అన్ని చోట్ల రద్దీ తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
మూడు కంపార్ట్ మెంట్లలోనే ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మూడు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు నేడు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట నుంచి రెండు గంటల సమయం మాత్రమే పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 82,628 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో res : 30,505 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.73 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

