Fri Dec 05 2025 14:59:17 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్... నేటి దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. గత రెండు నెలల నుంచి భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. అలిపిరి టోల్ గేట్ నుంచి రద్దీ కనపడుతుంది. అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాలను తనిఖీ చేయడానికి కూడా ఆలస్యమయంది. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తులతో క్యూ లైన్లు బయట వరకూ విస్తరించాయి. దాదాపు అన్ని రోజులు ఇరవై నాలుగు గంటల పాటు దర్శన సమయం భక్తులు వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మాత్రం భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
జూన్ నెలలో పోటెత్తిన భక్తులు...
జూన్ నెలలో భక్తులు తిరుమలకు పోటెత్తారు. జూన్ నెలలో తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దాదాపు 24 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అంటే రోజుకు ఎనభై వేల మందికి పైగానే భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నట్లయింది. జూన్ లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయ 120 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. గత ఏడాది కంటే ఇది 110 కోట్ల రూపాయలు అత్యధికంగా ఉంది. 1.19 కోట్ల లడ్డూలను విక్రయించారు. 10 లక్షల మంది భక్తులు తలనీలాలను సమర్పించారు.
నాలుగు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 76,126 దర్శించుకున్నారు. వీరిలో 24,720 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.97 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

