Wed Mar 18 2026 03:14:51 GMT+0530 (India Standard Time)
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తులు రద్దీ విపరీతంగా పెరిగింది. మంగళవారం కూడా భక్తుల సంఖ్య తిరుమలలో అధిక సంఖ్యలో ఉంది

తిరుమలలో భక్తులు రద్దీ విపరీతంగా పెరిగింది. మంగళవారం కూడా భక్తుల సంఖ్య తిరుమలలో అధిక సంఖ్యలో ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. బయట వరకూ క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి ఈరోజు 14 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి అధికారులు చెబుతున్నారు. ఈ వారం భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వారు అంటున్నారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 74,830 మంది భక్తులు దర్శించుకున్నారు. 39405 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. ఇక నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.79 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలను కల్పిస్తున్నామని వారు చెబుతున్నారు.
Next Story

