Mon Mar 16 2026 23:23:03 GMT+0530 (India Standard Time)
తిరుమలలో నేటి రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. నిన్నటి వరకూ కొంత తగ్గిన రద్దీ మళ్లీ పెరిగింది

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. నిన్నటి వరకూ కొంత తగ్గిన రద్దీ మళ్లీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఏడు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్వనం క్యూ లైన్ లో భక్తులకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు సర్వదర్శనం టోకెన్లు లేకుండా క్యూ లైన్ లో ప్రవేశించే భక్తులకు స్వామి వారి దర్శనం 16 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల శీఘ్రదర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు రెండు నుంచి మూడు గంటలలో శ్రీవారిని దర్శించుకునే వీలుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 61,921 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,141 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.68 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

