Tue Aug 09 2022 23:09:45 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో భక్తుల క్యూ మామూలుగా లేదు

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి రామ్బగీచా అతిధి గృహం వరకూ క్యూ లైన్ విస్తరించి ఉంది. భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల, తిరుపతి దేవస్ధానం అధికారులు చెబుతున్నారు. శని, ఆదివారాలు కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. మరోవైపు పరీక్ష ఫలితాలు వెలువడటం వల్ల భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు తిరుమల కొండకు చేరుకుంటున్నారు.
నిన్న ఆదాయం....
నిన్న తిరుమల శ్రీవారిని 64,628 భక్తులు దర్శించుకున్నారు. 41,613 మంది తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న హుండీ ఆదాయం 3.47 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ రెండు రోజులు భక్తుల రద్దీకి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. క్యూ లైన్లలో ఉన్న వారికి అన్నప్రసాదం, మంచినీటిని నిరంతరాయంగా సరఫరా చేస్తున్నారు.
Next Story