Wed Mar 18 2026 06:10:22 GMT+0530 (India Standard Time)
కిక్కిరిసిన కొండ.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి బయలకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి బయలకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 22 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి అధికారులు చెబుతున్నారు. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగిందని, శని, ఆదివారాలు కూడా రద్దీ కొనసాగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 75,047 మంది దర్శించుకున్నారు. 35,535 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 4.56 కోట్లు వచ్చిందని అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
Next Story

