Wed Mar 18 2026 06:09:36 GMT+0530 (India Standard Time)
శ్రీవారి దర్శన సమయం ఈరోజు?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వైకుంఠం కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వైకుంఠం కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఆస్థాన మండపం వరకూ భక్తుల క్యూ లైను కొనసాగుతుంది. స్వామి వారి దర్శనానికి భక్తలకు ప్రస్తుతం 16 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి అధికారులు చెబుతున్నారు. ఈ రద్దీ మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 62,141 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,880 మంది తలనీలాలను సమర్పించుకుని శ్రీవారికి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5.58 కోట్ల రూపాయలు అని అధికారులు చెప్పారు. వసతితో పాటు అన్ని సౌకర్యాలను తిరుమలలో ఉన్న భక్తులకు సమకూరుస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
Next Story

