Sat Dec 13 2025 22:33:10 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు నేడు వెళుతున్నారా? అయితే మీకొక గుడ్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. తిరుమలకు భక్తుల తాకిడి గత కొద్ది నెలల నుంచి ఎక్కువగా ఉంటుంది. కార్తీక మాసం కావడంతో పాటు శుభముహూర్తాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు కూడా జరుగుతుండటంతో వాటిని ముగించుకుని తర్వాత శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటున్నారు. మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, మొంథా తుపాను సమయంలో కొంత రద్దీ తగ్గినట్లు కనిపించినా మళ్లీ భక్తుల రద్దీ పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
సులువు దర్శనం కల్పించేందుకు...
తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ పెరగడంతో పాలకమండలి కూడా ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటుంది. అనేక నిర్ణయాలు తీసుకుని తిరుమలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. భక్తులకు సులువుగా, వీలయినంత త్వరగా దర్శనం కల్పించడంతో పాటు వచ్చిన భక్తులందరికీ వసతి సౌకర్యంతో పాటు అన్న ప్రసాదాలను అందించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, భక్తుల సంఖ్యతో సంబంధం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
21 కంపార్ట్ మెంట్లలో వేచిఉన్న...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 21 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 63,239 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,436 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.78 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

