Tue Mar 17 2026 02:32:29 GMT+0530 (India Standard Time)
తిరుమలలో ఈరోజు రష్ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తుల సంఖ్య తిరుమలలో అధికంగానే ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తుల సంఖ్య తిరుమలలో అధికంగానే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 15 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోని భక్తులకు దర్శన సమయం ఐదు గంటలు పడుతుంది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం పథ్నాలుగు గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనం...
ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 71,434 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,212 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.78 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
Next Story

