Tue Mar 17 2026 19:17:51 GMT+0530 (India Standard Time)
నేడు తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా అందుకు మినహాయింపులేదు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా అందుకు మినహాయింపులేదు. ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల రాకతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. రూ.300లు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని చెప్పారు.
హుండీ ఆదాయం...
ఇక నిన్న తిరుమల శ్రీవారిని 70,067 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,092 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.61 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Next Story

