Fri Mar 13 2026 09:09:30 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈరోజు పదమూడు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈరోజు పదమూడు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది.
పదమూడు కంపార్ట్మెంట్లలో...
నిన్న తిరుమల శ్రీవారిని 65,570 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,446 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.
Next Story

