Fri Dec 05 2025 14:59:27 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉందిగా.. ఈరోజు దర్శన సమయం ఎంతంటే?
నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది

నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. గత నాలుగు నెలల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. భారీ వర్షాలయినా సరే తిరుమలకు భక్తులు చేరుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలకు వచ్చే భక్తులు అధికం కావడంతో వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. లడ్డూ తయారీ కేంద్రాల వద్ద, అన్నప్రసాదం కేంద్రం వద్ద కూడా భక్తులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు.
దసరా ఏర్పాట్లపై...
తిరుమలకు ఇక రానున్న రోజుల్లో మరింత భక్తుల రద్దీ పెరగనుంది. దసరా సెలవులు కావడంతో ముందుగానే బుక్ చేసుకున్న భక్తులతో పాటు అప్పటికప్పుడు వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఇప్పటికే నూతనంగా నియమితులైన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులతో సమీక్షించారు. క్యూ లైన్ల వద్ద భక్తులు ఇబ్బంది పడకుండా, మాడవీధుల్లోనూ తగిన చర్యల చేపట్టాలని ఆదేశించారు.
ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ఉదయం ప్రవేశించని భక్తులకు నేడు శ్రీవారి దర్శనం పదిహేను గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 77,893 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,604మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాంయ 3.53 కోట్ల రూపాయలు వచ్చింది.
Next Story

