Wed Mar 18 2026 01:42:35 GMT+0530 (India Standard Time)
తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరస సెలవులు కావడంతో భక్తుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరస సెలవులు కావడంతో భక్తుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. వైకుంఠం కాంప్లెక్స్ లోని 30 కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
ఐదు కోట్లు....
నిన్న తిరుమల శ్రీవారిని 87,692 భక్తులు దర్శించుకున్నారు. 36,832 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.30 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. మరి కొద్ది రోజులు భక్తుల రద్దీ కొనసాగే అవకాశముందన్న అంచనాలో అధికారులు ఉన్నారు.
Next Story

