Fri Dec 05 2025 16:51:21 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : అలిపిరి టోల్ గేట్ వద్ద చూస్తే చాలదూ.. తిరుమలలో ఎంత రష్ ఉండేది?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. క్యూ లైన్లు బయట వరకూ విస్తరించి ఉన్నాయి. బయట రెండు కిలోమీటర్ల మేరకు క్యూ లైన్లు విస్తరించి ఉంటూనే ఉన్నాయి. తిరుమలలో రద్దీ తెలియాలంటే అలిపిరి టోల్ గేట్ వద్దనే కనపడుతుంది. వాహనాలను తనిఖీ చేసే సమయంలోనే గంటల కొద్దీ వాహనాలు నిలుస్తుండటంతో పాటు ఘాట్ రోడ్డులో వాహనాల రద్దీతో తిరుమలలో ఎంత రద్దీ ఉంటుందో అంచనా వేయవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఎన్నడూ లేని విధంగా...
తిరుమల తిరుపతి దేవస్థానానికి గత రెండున్నర నెలల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. ఎక్కడ చూసినా భక్తులతో కిటకిటలాడిపోతుంది. తిరుమలలో గతంలో ఎన్నడూ జులై నెలలో ఇలాంటి పరిస్థితులు లేవని, వారాలతో సంబంధం లేకుండా భక్తులు తిరుమలకు వచ్చి దర్శించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. గతంలో జులై నెలలో పెద్దగా రద్దీ ఉండేది కాదని, కానీ ఈనెల కూడా హుండీ ఆదాయం భారీగా వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులో నిండిపోయాయి. శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. అంటే రెండు కిలోమీటర్ల మేరకు భక్తులు బయట క్యూ లైన్ లో స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఏడు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 75,104 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో31,896 మంది తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.66 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

