Tue Mar 17 2026 07:51:08 GMT+0530 (India Standard Time)
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి 26 గంటల సమయం పడుతుంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి 26 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 26 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు సర్వదర్శనం క్యూలైన్ లో వచ్చే భక్తులకు అదనంగా నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమలకు 67,156 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 24,752 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.92 కోట్ల రూపాయలని అధికారులు వెల్లడించారు.
Next Story

