Tue Mar 17 2026 13:47:46 GMT+0530 (India Standard Time)
తిరుమలలో భక్తుల రద్దీ ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా తిరుమలలో భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా తిరుమలలో భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోని భక్తులకు స్వామి వారి దర్శనం కోసం 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఇప్పుడు క్యూ లైన్ లో ప్రవేశించే వారికి మరో నాలుగు గంటలు అదనపు సమయం పట్టే అవకాశముందని తెలిపారు.
వీఐపీ బ్రేక్ దర్శనాలు....
ఈరోజు నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను 7.30 నుంచి అమలు చేయనున్నారు. సర్వదర్శనం భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 69,640 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,649 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.65 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

