Mon Feb 02 2026 14:45:27 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో భక్తుల రద్దీ...?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తులు క్యూలైన్ లలో స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తులు క్యూలైన్ లలో స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం చేసుకునే భక్తులకు స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఇప్పుడు క్యూలైన్ లో వచ్చే వారికి అదనంగా మరికొంత సమయం పడుతుందని తెలిపారు.
హుండీ ఆదాయం....
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు గంటల నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 74,354 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,931 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.68 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
- Tags
- rush tirumala
Next Story

