Thu Mar 19 2026 04:12:26 GMT+0530 (India Standard Time)
Tirumala : నేడు కూడా తిరుమలలో భక్తుల రద్దీ... ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తుల సంఖ్య తిరుమలలో ఎక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తుల సంఖ్య తిరుమలలో ఎక్కువగా ఉంది. గత పది రోజులనుంచి తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి క్యూ లైన్లు బయట వరకూ విస్తరించడంతో భక్తులకు శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. ఈరోజు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
పదహారు గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఈరోజు ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పదహారు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 89,161 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 36,450 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.77 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

