Mon Mar 16 2026 20:03:54 GMT+0530 (India Standard Time)
దర్శనానికి 24 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తుల రద్దీ తిరుమలలో అధికంగానే ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తుల రద్దీ తిరుమలలో అధికంగానే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పథ్నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు సర్వదర్శనం క్యూ లైన్లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన వారికి స్వామి వారి దర్శనం 24 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల శీఘ్రదర్శనం క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 82,398 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,076 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.40 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

